Friday, October 17, 2014

అంతఃమైన నా మనస్సు



నాతో  నేనే  నాలో నేనే నాకై నేనే  నా అంతఃరాత్మతో జరుపుతున్నాను యుద్ధం
అయినవారికి అండగా ఉండి  రానివ్వకూడదనుకున్నాను  ఏ కష్టం
విధి ఆటకు బానిసలై నమ్ముకున్న నా వాళ్లె మిగిల్చారు నాకు విషాదం
ఆలస్యంగా తెలిసెను, స్వార్దచింతనలేని లోకానికి ఆత్మీయత అన్నది పెద్ద అబద్దం
అందరికై  జీవించిన నేను, నాకై జీవించక అయ్యాను నాకే ఓ జ్ఞాపకం
నాలో లేని నాకు రేపన్నది వ్యర్దం, బ్రతుకన్నది తీరని శోకం
గెలిచానో ఓడానో తెలియదు కాని అయిపోయింది నా అంతఃరాత్మ అంతః !

Wednesday, September 12, 2012

నా ప్రాణం

నన్ను విడిచి వెళ్ళిన నా ప్రాణం
నాతొ మాటలాడనన్నదా నీ మౌనం 
నీకై విలపించి  నా కన్నులాయెను సాగరం
ఆ కన్నీటి కెరటాలా రాగంలోనూ నీ నామం 

నన్ను చేసివేశావు ఓ శల్యం
నువ్వు రాక నిదురలేవనంటోంది నా నయనం 
నీ ఊహలాయెను ఓ జ్ఞాపకం 
ఆ జ్ఞాపకాలే నాలో నీకై రగిలే తీయ్యని గాయం 

నువ్వు లేవు అన్నాక  నే శూన్యం 
నాపై కరుణన్నదె లేదా ఓ ఆశా దీపం 
నే చూశాను శూన్యంలో  నీ రూపం 
ఆ రూపంలో కనిపిస్తుంది నా జీవిత గమనం 

Sunday, June 3, 2012

నాకు నువ్వు

ప్రపంచం ఎదురొచ్చినా పోరాడే నా ధైర్యం నువ్వు 
ఎవరు కాదన్నా అవునన్నా నా ధ్యాస ధ్యానం నువ్వు
కన్ను మూసిన తెరచిన నా రెప్పల మాటున దాగిన స్వప్నం నువ్వు
మూగవోయిన గాత్రంతో అనుక్షణం నేనాలపించే నా శివరంజని రాగం నువ్వు
దూరమైనా చేరువైన నా పయనానికి  గమ్యం నువ్వు
నీ నీడనై ఉంటా నిసి రాత్రి మింగేస్తున్న వెన్నెల వెలుగువై నాతొ ఉంటావని నువ్వు 

Sunday, March 11, 2012

కంటి పాప


కన్ను మూసిన తెరచిన కంటి పాపను వీడలేము

నా కంటి పాపా దూరమై నా కన్నీరాయెను మున్నేరు

ఆ మున్నేరులో మునకలేస్తూ దూరమయ్యాను నా లక్ష్యాలను

లక్ష్యం మరచిన ఎదురీదాలి చేరేందుకు నా కలవైన నిన్ను

Sunday, March 4, 2012

ఎదురీత...



నీ తీయ్యని మాటలతో నాలో రేపావు మునుపెన్నడూ కలగని ఆశల్ని

ఆ ఆశల్ని నీ హర్ష వర్షంతో చిగురిమ్పచేసి చేశావు నన్ను నీ స్వప్నాన్ని

ఇంతలోనే, ఆ స్వప్న లోకంలో విహరించే నా ఊహల్ని చేశావు ఎడారిలో ఎండమావుల్ని

ఆ యడబాటుతో తల్లడిల్లుతున్న నాలో రేపుతూనే ఉన్నావు మానని గాయాల్ని

ఈ గాయాల బాధను తాళలేక నిన్ను చేరలేక చెమర్చాయి నా కళ్ళన్నీ

చెమర్చిన కళ్ళతో, తీరాన్ని చూపని నీకై ఎదురీదుతూనే ఉన్నాను దుఖసాగారాన్ని.

Wednesday, February 15, 2012

నీ కంటి పాపలో నేను



ప్రపంచాన్ని మరచి నీ కళ్ళల్లోకి చూస్తూ
నన్ను తాకే నీ వెచ్చని శ్వాసను ఆస్వాదిస్తూ
నీ కరములను నా కరములచే గట్టిగ హత్తుకొని నువ్వు
నీ ప్రేమ నాకు మాత్రమే సొంతం అనుకుంటూ
భీతన్నది లేక నీ కనురెప్పమాటున నిదురించాలనుకున్నాను

దైవం ఈర్షతో విధి అనే ఆట ఆడుతూ
మట్టిబొమ్మలం అని మనస్సులు విరిచేస్తూ
నిన్ను నా నుండి వేరుచెయ్యాలని ఆకాంక్షిస్తుంటే
బీరువల్లే పారిపోక ఒక్క క్షణం ఆగమని
నీ వియోగము కలిగించక మునుపే నా ఊపిరి గైకొనమంటాను

Saturday, February 4, 2012

నా ఊపిరి



నా నీడవైతే నిన్ను విడిచి చీకటిలో బ్రతికెసేవాన్ని
నా కలవైతే నిదురకు దూరంగా ఉండిపోయేవాన్ని
నా ఊహవైతే బరువెక్కిన హృదయంతో వెలివెసేవాన్ని
నా కన్నీరువైతే ఇంకిపోఎవరకు విలపించేవాన్ని
నా ఊపిరే నువ్వైనప్పుడు ఎలా వదలను కడవరకు నీ నేస్తాన్ని?