Wednesday, November 26, 2008

నిరంతర ప్రయత్నం

ఆకాశాన్ని చేరలేకున్న కెరటాలు అలుపెరుగక ఉవ్వేతున పైకి ఎగిసేను
మేఘాల గుండె కరిగి ప్రేమతో చిరుజల్లై నింగిని వీడి ఈ కెరటాలను చేరెను
నీ ఆశ శ్వాస అయిన దాని కోసం అలుపెరుగక ప్రయత్నం కొనసాగించు
అడవిన వున్నా నీ కొరకు ఆ వెన్నెల వెలుగులు వచ్చి చేరెను

అర్ధం తెలియని మహాకావ్యం

సృష్టి యొక్క బలం బలహీనత ప్రేమ
చావు పుట్టుకలకు మద్య గల అనుబందం ప్రేమ

ఆకాశం కోసం ఎగిసే కెరటాల ఆరాటం ప్రేమ
ఎడారిలో ఎండమావిలో నీరు ప్రేమ

ప్రపంచాన్ని జయించే శక్తినిచ్చేది ప్రేమ
ద్వేషాన్ని కూడా ప్రేమతో గెలిచేది ప్రేమ

ఆకలిని తెలుసుకొని అన్నం పెట్టె అమ్మంటే ప్రేమ
కావలసింది తెలుసుకొని ఇచ్చే నాన్నంటే ప్రేమ

నొప్పి తెలియని తీయ్యని గాయం ప్రేమ
చితి మీద వున్నా నిన్ను వీడని జ్ఞాపకం ప్రేమ

ఈ సమాజం యొక్క బలం బలహీనత ప్రేమ
మనస్సును మైమరపించే మైకం ప్రేమ

యవ్వనంలో కలిగే భావన ప్రేమ
వృద్దాప్యం లో వుండే ఆప్యాయత ప్రేమ

మరణం అంటూ లేనేలేనిది ప్రేమ
స్నేహాన్ని సైతం విడదీసేది ప్రేమ

ఆకాశానికి ఉవ్వెత్తున ఎగసిపడే అలజడి ప్రేమ
చితిమీద కూడా పరిమలించెను ప్రేమ

ఊహ లోకం లో విహరించేలా చేసేది ప్రేమ
నిన్ను నువ్వు మరిచేలా చేసేది ప్రేమ

కొమ్మన విరిసే కుసుమం ప్రేమ
వెన్నెల విరిసే విరహం ప్రేమ

గమ్యం తెలియని పయనం ప్రేమ
చీకటిలో వెన్నెల్లా వెలుగుచుపెను ప్రేమ

అర్ధం తెలియని రెండక్షరాల పదం ప్రేమ
వ్యర్ధం కాని జీవిత పరమార్ధం ప్రేమ

Saturday, November 15, 2008

మాత్రుముర్తికి అంకితం

కరుణ అను సంద్రం చిలికినప్పుడు ఉదయించిన కమ్మని కావ్యం అమ్మ
కల్మషం లేక తన కమ్మని ప్రేమని పంచుటకు ఇలలో వెలిసిన దైవం అమ్మ
పట్టుపురుగుల తానూ పోతూ కూడా నీకు మంచి చెయ్యాలనుకునేది అమ్మ
నీవు తన గుండెలపై తన్నినా ఓర్పుతో నీ ఆకలిని తీర్చి తన ఔదార్యాన్ని పంచేది అమ్మ
కఠినంగా ఆమె హృదయాన్ని గాయపరిచిన తన చల్లని దీవెనలు ఇచ్చేదే అమ్మ

Friday, November 14, 2008

అర్ధం కాని అమ్మాయి మనస్సు

సాగర కెరటాలతో తేలియాడు తామరాకుపై నీటి తుంపర తరుణీ మనస్సు
కలువరేకులా తన తీయ్యని పరిమళాలతో ఆకర్షించెను ఆమె సొగస్సు
నడి సంద్రంలో గమ్యం తెలియని నావల అవగాహనా కాదు ఆమె అంతరంగాల సరస్సు
ఆమె మనోభావాల ఆశల అలలతో ఎదురు ఈదాలన్న తిరిగిరాదు నీ వయస్సు

Thursday, November 13, 2008

ప్రేమ తో విధి ఆడిన ఆట

నా కొరకై దివిని వీడి ధరణికి చినుకులా వచ్చావు
నా జీవితం లో రంగుల హరివిలై పువ్వులు పూయించావు
విధి అనే వింత నాటకం తో ఆకుల రాలిపోయవు
నీవు మట్టిలో కలిసి నన్ను మోడుగా మార్చావు

జన్మదిన శుభాకాంక్షలు

పసి పాపాయి మోము పసిడి కాంతుల నవ్వూ
మంచితనపు మారు పేరు కొత్తదనం కొసరు పేరు
పదహారణాల మన లావన్యనికి మరపు రాని రోజు
తెలియజెయ్యాలి తనకు శుభాకాంక్షలు మరోమారు

గెలుపు కొరకు బాటసారి

ఇన్ని నాళ్ళ పయనమింక ఆగిపోయే దేనివలనో
కోరుకున్న తిరమింక చేరలేక పోతున్నావా
గమ్యమింక చేరలేని బాటసారి అయ్యినవా
తప్పు నువ్వు తెలుసుకొని తీరమింక చేరుకోరా
గెలుపు కొరకు పరుగుతేసి విజయ లక్ష్మి చెంతచేరు

Wednesday, October 29, 2008

ఒంటరి బాటసారి

వెళుతున్న వెళుతున్న వస్తావా నాకోసం
రాచిలక నీకొరకై ఆరాటం నాకెంతో
కరుణించి నువ్వింకా వెన్నెలవై వెంచేయ్యి
నవ్వులతో నాపైన చిరుజల్లై తడిపెయ్యి

Tuesday, October 14, 2008

ప్రియుని ఊహ

వసంత కోయిల గానాం ఈ నవ కోమలాంగి తీయ్యని రాగం
ఆకాశాన ఆశల పయనం నా సాహితమ్మ ఊహల గీతం
మంచు కన్నా చల్లని నైజం మరువలేని నా నిర్చెలి హృదయం
హాయిగొలుపు వెన్నెల వైనం హొయలు ఒలుకు ఆ చిరునవ్వుల రూపం

Thursday, October 2, 2008

ప్రియురాలి వర్ణన

తొలిపొద్దు పొడుపులో మంచుకన్న తెల్లనైన నీ రూపం
చిరు గాలి కన్నా చల్లనైన నీ చిరునవ్వు
ముత్యాల వంటి పళ్ళు కలువరేకుల లాంటి కళ్ళు
నయాగరా జలపాతం లాంటి కురులు కల
నా చెలిని చూసి ఆ నెలవంక నివ్వెరబొయెనా లేక ఆ వెన్నెల వాలిపోయెనా
నీ కోసం వేచి యున్న నాపై ఒకసారి నీ మనసు ద్వారాలు తెరిచి చిరునవ్వుల వర్షం కురిపించలేవా
ఆ చిరునవ్వు కోసం వదిలేస్తాను నా పంచ ప్రాణాలు ఓ నేస్తమా

ఎదురుచూసే ప్రేమ

ఓ నేస్తమా నీవెక్కడో నేనిక్కడ ఏనాటికి మన కలయిక
సాగర కెరటం వలె నీ కాలి అందియలు నా మదిలో నాట్యం చేస్తున్నాయి
నా గుండెలో వెలుగుచున్న ఆశల జ్యోతే నీ రూపం
నా ముగా సైగల బాష పలికేది నీ పేరు
నిన్ను కలిసే భాగ్యము ఈ కన్నుల కెన్నడు కలుగును
నీ కాలి పట్టియని అయిన అవ్వలేకపోయాను ఓ నేస్తమా !

తెలుగోడి ఆత్మగౌరవం

మాతృభూమిని దూషించిన మారణ కాండ జరిపెస్తా
శత్రువుల పాలిట యమకిన్కరున్నై మట్టిలో కలిపెస్తా
మమకారం ప్రేమ కలిగిన తెలుగోళ్ళ గుండె చప్పుడు నేనౌతా
అడ్డం వచ్చిన నయవంచకుల పాలిట మృత్యువు నేనౌతా

Tuesday, September 30, 2008

సంగీతం గొప్పతనం

సంగీతం లోని సప్త స్వరాలే సాహిత్యానికి నవనాడులు
కఠిన పషానాన్ని సైతం కరిగించే మధుర కావ్యాలు
ఎండమావిలో నీటిని చూపగల కమ్మని రాగాలూ
ఎండిన మోడుని చిగురిమ్పచేయ్యగల ఆశల గీతాలు

Friday, August 29, 2008

పేదరికం పై పోరాటం

సప్త వర్ణాలకు అతీతము నేను అష్టమ వర్ణపు రూపము నేను
అలసిన సొలసిన ఆగాను నేను గమ్యం తెలిసే వరకు నాకు
కలలతో బ్రమపడి పోను నేను అంతిమ విజయం పొందే వరకు
పోరాటాన్ని ఆపను నేను పేదల కష్టం సమసేవరకు

సాహిత్యం

సాగర సంగమము సాహితి గమనం
సమరాన్ని సైతము ఆపే అందెల రావం
అరుణం నుండి ఉదయించే చిరునవ్వుల గానం
కరుణ ప్రేమ కలిగిన కమ్మని కావ్యం

Monday, August 25, 2008

నందమూరి తారక రామారావు

N T R పేరులోనే వుంది నటన త్యాగం రాజసం
కోట్లమంది ఆంధ్రుల్లో ఒక్కడు ఒక యుగానికి రారాజు .
తెలుగు సినిమా చరిత్రలో మకుటం లేని మహారాజు .
ప్రేక్షక హృదయాల్లో నిలిచిపోయిన మన కవిరాజు .
ఎందరు వచ్చిన తెలుగోడి గుండెలో చెరిగిపోని మన యువరాజు
ఇలలో ప్రజల కొరకు వెలిసిన మన దైవం ఈ నటరాజు.

అమ్మాయి మదిలో దాగివున్న ప్రేమ

నీలో నే వున్నా అని తెలిసీ, అది తెలుపంగ మాట పెదవి దాటనీవు
ఎడారిలో ఎండమావిలా భారంగా దూరంగా వెళతావు
నీ మునన్ వెనుక ఆంతర్యం తెలుపక నాకు, కాలంతో నువ్వింకా సాగేవు
నాపై వున్నా ప్రేమను మొత్తం గుండెల్లో దాచేసి, భాదంతా కన్నీరై వదిలేవు.

Friday, August 1, 2008

నిజమైన మనిషి

ఎవ్వరికి ఏమీ కానూ ఈ విశాల విశ్వమందు ఒ ఒంటరి నేను
అందరు వున్నా అనాదను నేను , ఎడారిలో ఎండమావిలాంటి జీవనం నాది
మార్గములు అన్ని వున్నా గమ్యం తెలియని పయనం నాది
క్రోవ్వోత్తిల కాలిపోయి అయిన పది మందికి వెలుగునివ్వలన్న తపన నాది !

Saturday, July 26, 2008

నేటి మనిషి పయనం

ఓ మనిషి ఎక్కడికో నీ పయనము ఏప్పుడు చేరేవో నీ గమ్యము
ఊపిరి వున్నంత వరకు ఏదో అయ్యిపోదామని తపించేవు
గాలిలో ఎగరాలని ప్రయత్నించి నిల్చున్న నేలను మరిచేవు
మంచిని మందిని మరచి ధనం కోసం పరుగులు తేసేవు
నీ మంచి తప్ప నీతో ఏది రాదని చివరి గడియలో చిన్తిన్చేవు

Tuesday, July 8, 2008

అమ్మాయి మనస్సు

మగువ మనస్సు మహాసముద్రం కన్న లోతైనది
దూరానికి ప్రశాంతంగా వున్నా సంద్రం మనస్సులో బడభాగ్ని దాచి వున్చుతుంది.
ఎగిసే అలల తన గల గల ద్వనులతో నిన్ను మైమరపిస్తుంది.
అల ఎంత ఎగిసి నీ వైపే వచినట్టు వున్నా సంద్రన్ని వీడి రాదూ.

ప్రేమ వేదన

కనుల లోన పాపా నీవై నిదుర కరవు చేసావు నాకు
గుండెలోన చేరిపోయి తియ్యని బాధ రేపావే నాలో
చినుకు లాగా చేరి నాలో వరదలాగ మారవు నువ్వు
తీరమింక చేరలేని బాటసారి అయితి నేను
కంటి లోన వెలుగు అయ్యి దారి చూపు నాకు నువ్వు
ఇంద్రదనస్సు లాగా నువ్వు చేరుకోవ నన్ను నేడు

Monday, June 23, 2008

ఓ ఒంటరి ప్రేమ వేదన

నీ జాడ కోసం వెదకి వెదకి నీ వేసగిపోయా !
నా ప్రేమ దాహం తెర్చేయ్యగా నువ్వు చినుకల్లె రావా !
ఆ ప్రేమ జల్లులో తడిపేసి నన్ను చిగురింప చెయ్యి !
నా శ్వాసలోన శ్వాసగా మారి బ్రతికించ లేవా!

Saturday, May 31, 2008

నేటి మానవునికి ఒక సందేశం

పుట్టినప్పుడు గుక్కెడు పాలు చాలు ! చచ్చినప్పుడు బండెడు కట్టెలు చాలు !
నడుమ వున్నా ఈ నాలుగునాళ్ళ నాటకములు ఎలా మిత్రమా !
ఎంత సంపాదించిన ఇసుమంత మంచిని కొనగలవా !
రాజు నిలిచివుండు ప్రజల నాలుకలపైన ! మంచివాడు నిలిచివుండు ప్రజల హృదయములలోన!
కనపడని దైవానికెల కర్పూర నీరాజనాలు, పాలభిషేకాలు!
కనిపించే పెదవానికి ఇవ్వరెలా కటికెడు గంజి నీళైనా!

అమ్మ అమృతం కన్నా మిన్న

ప్రపంచం ఎంత విశాలమైనధైన నీ కన్న తల్లి మనసులోని చోటుకి సారిరాదు
అమ్మ అను మాటలోని తియ్యదనం అమృతం నైన వుండదు
నిన్ను నీకన్న ప్రేమించే వారు ఎవరైనా వుంటే అది అమ్మ మాత్రమే
కన్న తల్లిని మాత్రుభుమిని మరచిన వాడు చచ్చిన బ్రతికిన ఒక్కటే !

ప్రేమ కలవరం

సడిలేని సంద్రం లోని అలవా !
నా హ్రుదయాన్ని కలవరపరచగ వచ్చిన అలజడివా!
తొలకరిలో పులకిమ్ప చేయు చిరుజల్లువా!
దయలేక ముంచెయ్యగ వచ్చిన ఓ వరదవా!
మల్లె తీగలా నన్ను అల్లేసినావా!
నీ చిరునవ్వులతో నన్ను బంధించినవా!
నీవు లేని నిమిషన్ని ఊహించలేవా!
నీకోసమే వేచియున్న నన్ను కరుణించగ రావా!

నిజమైన ప్రేమ

ఫలించిన ప్రేమ పడక గదితో అంతం అవుతుంది
ఫలించని ప్రేమ చితి మీద కుడా పరిమలిస్తూ వుంటుంది
నా ప్రేమ నడి సంద్రం లోని నావా వలె ఆగిపోయింది.

ప్రేమికుని శ్వాస ఆశ

ఈ విశ్వం ఎంత విశాలమైనధైన నాకు నీ మనసులో చిన్ని చోటు చాలు
నా చుట్టు ఎందరు వున్నా నన్ను నడిపించడానికి నీ కమ్మని ఊహ చాలు
మండే ఎండలో సైతం నన్ను హాయిగా వుంచే నీ చిరునవ్వు చాలు
కరిగిపోని నా ప్రేమకు మదిలో చెరిగిపోని నీ రూపు చాలు.

ప్రేమికుని ప్రేమ సందేశం

చిరు మనసును కదిలించిన చెలి హృదయమా !
కనుమూసిన నను వదలని ఒ మైకమా !
శిలలాంటి మనసును కరిగించిన ఒ రూపామా!
నీ ఊహలలో విహరించుట నా నేరమా !
ఆ వాలు చూపులను ఆపుట నా తరమా !
నీ వైపే లాగే పాదాన్ని ఆపుట ఇక సాద్యమా !
కడగళ్ళు కదతెర్చగా రావేమి ఇది శాపమా !
కరుణించి కనిపించు నా దైవమా !

ప్రేమ విరహం

నీలి మబ్బువు నువ్వైతే కటిక నేలను నేను !
తీరం ఆవల నువ్వు చేరాలని కెరటాన్ని నేను !
తెల్లని మంచువు నువ్వు భగ భగ మండే మంటను నేను !
కరునించగా వస్తావా నువ్వు మైమరిచిపోతను నన్ను నేను !

ప్రేయసి కోసం

నను నేను మరిచేల చేయు నీ నవ్వంటే నాకిష్టం!
కోపంతో చుసిన నీ కళ్లంటే నాకిష్టం !
నన్ను భందించే నీ వాలు జడ అంటే నాకిష్టం !
నిన్ను నేను చూసేలా చేసిన ఆ బ్రమ్మంటే నాకిష్టం !
నువ్వు దూరమైన నన్ను వదిలేన ఈ ఇష్టం !
పడతాను ఎ కష్టమైన మరి దొరికేనా ఈ ఇష్టం !

ప్రేమ విచిత్రం

చెలి నవ్వును చూడగానే చిరుచేమటలు మయమయ్యేను !
తొలి మంచులో తరలిపోవు ఆ రూపు చూసి నెలవంక చిన్నబోయెను!
మధురమైన ఆ వాణి విని కోయిల గాత్రం ముగావోయెను!
నీ నడకలోని వయ్యారం చూసి నాట్య మయూరి నివ్వేరపోయెను!
నాలోనూ నువ్వే చేరితే ఈ విశ్వం లో నేను ఎచట ఉండను!

ప్రేమానుభుతి

నా మదిలో కొలువున్న ఒ అపురుపా శిల్పమా
నీ నవ్వులో వున్నాయి సంగేతం లోని సప్తస్వరాలు !
నా ఊహలో విహరించు ఒ మధుర స్వప్నమా
నీ నడకలో వినపడుతున్నాయి సెలయేటి గలగలలు !
తరలిరావే తన్మయంతో నా యద కోవెల లోని ఒ దైవమా !
నువ్వు రాకున్నా పోయేనేమో నా పంచ ప్రాణాలు !

ప్రేమ కొరకు ఆరాటం

చురకత్తుల లాంటి నీ చూపులతో నన్ను భంధించినవా!
నా శ్వాసను నీ జ్ఞాపకాలుగా మర్చేసినవా !
తడి జాడే లేని నా యద లోని దాహాన్ని తీర్చేయ్యగా రావా!
మోదుగ వున్నా నాపైన నీ ప్రేమ చిరు జల్లు కురిపించగా రావా !

మరువలేని ప్రేమ

నీ మాటలతో నన్ను ఆకర్షించావు !
ఆ వాలు కనులతో నా మనసు లాగేశావు !
ఆ నంగనాచి జడతో నన్ను కట్టిపడేసావు!
నీ ప్రోత్సాహంతో విజయాన్ని చేరువ చేసావు !
నా శ్వాశలో శ్వశావై చేరువైపోయవు !
కరుణలేని మరణం తో దూర మయ్యావు !
మరువలేని ప్రేమతో పిచ్చివాణి చేసావు !
నీ గత స్మృతులతో బ్రతికేయ్యమన్నావు !

ప్రేమ చిరుకానుక

కొమ్మ మీద కోయిల గానం నా యదలో నీ ఊహ రాగం !
వసంతంలా వచ్చి నా మదిలో రగిలించావు ప్రేమ రాగం !

చెదిరిన ప్రేమకు అంకితం

ప్రేమ అనే పేరుతో రెండు మనసులను కలిపేస్తావు!
మనషులు వేరైనా మనస్సు ఒక్కటే అనేలా చేసేస్తావు!
ఇంతలోనే దురంచేసి తట్టుకోలేని విరహంతో బందిస్తావు!
ఒ ప్రేమ నువ్వు తియ్యని జ్ఞాపకానివా లేక హృదయానికి కోలుకోని గాయం చెయ్యగా వచ్చిన నరకానివా!

ప్రియుని మరణ వేదన

అంతిమ వీడ్కోలు ప్రియతమా అందుకో నా మేఘ సందేశం .............
వసంతంలో వచ్చు వాన జల్లులా నన్ను ప్రేమ అను మైకంతో తడిపేసినావు!
నువ్వే నేను అన్నావు నీ ఊహలలో నన్ను విహరించేల చేసావు !
పెళ్లి అను పేరు మనను వేరు చేసిన నీ జ్ఞాపకాలు నన్నువదిలి పోవు !
నా కన్నీటి జల ధారలానే నాకు కడదాక తోడుగా నిలిపావు !
మరువలేని నేను నా మరనన్నే నీకు కానుకల ఇచ్చేలా అయ్యావు !
హృదయం లో దీపంలాంటి నువ్వే నన్ను చితి మీద దహించే లా చేశావు!

ప్రేమ మహత్యం

ఎవరే నువ్వు ఎదలో గాయం రగిలించావు !
కన్నుల లోన కలలా నన్ను వేదిస్తావు !
నా ధ్యాస ద్యానం అన్ని నువై నన్ను కదిలించావు !
నా శ్వాసలలోన ఆశలరాగం పలికిస్తావు !
జీవం వున్నా మనసే లేని శిలగా నన్ను మర్చేశావు !
నా నీడలా నన్ను వెంటాడుతూ వుంటూ ఆనంధిస్తావు !
దివినే వీడి ధరణిని చేరిన మేఘంలా నన్ను తదిపెశావు !
నా ఊహల లోన ఊయల నువై నీ నవ్వుల బాణం సందిస్తావు !

Friday, January 4, 2008

ప్రియురాలి మరణం

కాలంతో పోటి పడమన్నావు !
నీలో టేలెంట్ వుంది అన్నావు !
నా లక్షాన్ని చేరుకోనెల చేశావు !
చివరవరకు నాతోనే ఉంటానన్నావు!
చిమ్మ చీకటి చేసి దూర మయ్యావు !
నా జీవితం లో సాగిపోమ్మన్నావు !
నువ్వు లేక ఇది ఎలా సాద్యమంటావు !

కవిత మాలిక

అలపన్నది లేని అలలా నువ్వు నా లయలో అలజడి రేపుతూ ఉంటే
నిదురన్నది రాదు నా దరికే కలలోను నువ్వే నన్ను కుదిపేస్తుంటే
తడి జాడే లేదు నా పెదవులకు , శ్వాసలో ఆశ నువ్వై వెంటాడుతూ ఉంటే
పయనంలోను గమ్యం లేదు నా మదికి నీ ఆచూకీ మరి తెలియక ఉంటే
చలనం అన్నది లేనే లేదు నా యదలో నీ పేరే అది పలుకుతూ ఉంటే
మరణం నా దరికే రాదు నువ్వు నా వెన్నంటి ఉంటే .