Tuesday, December 8, 2009

మంచు బొమ్మ


నిన్ను చూసిన క్షణానే నీ రూపును మలిచాను నా హృదయంలో ఓ మంచు శిల్పంలా
విధి ఆడే ఆటతో నీ రూపు ద్రవిభవించి చెరగని గాయం అవుతుంది నా లయలో
నా కన్నీరు ఉవ్వెత్తున ఎగసి నీ జ్ఞాపకాల బడభాగ్ని చిమ్ముతుంది నా కన్నుల సాగరంలో
నా కన్నీరుగా అయిన నిన్ను విడువలేని నా కన్నులు మారాయి తడి జాడేలేని ఓ ఎండమావిలా

Monday, October 5, 2009

నీకోసం నేను


మండుతున్న ఎండను శాంత పరిచే
తొలకరి చిరు జల్లులా వస్తాను
తీగలా నిన్ను అల్లుకొని నీ మదిలో
పువ్వులా ఆనంద రాగాలూ పలికిస్తాను
వసంతాన కూసే కోయిల రాగమై
నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసే కిల కిల రావం అవుతాను
చిలిపి చేష్టలతో నీలో హావా భావాలను
పలికించి హాయిగొలిపే పసిడిబొమ్మ నేనౌతాను

దూరదేశాన ఆలపించే మనస్సు

అందరికి దూరంగా ఉన్నంత మాత్రాన ఒంటరివి కావు
ప్రేమాభిమానాలకు ఎల్లలు హద్దులు ఉండవు
గాలి కన్నా వేగమైన మనస్సుతో నీ దూరతీరాన్ని చేరుకోగలవు
ఆ దూరతీరనా గల నీ ప్రేమను దగ్గరగా చూడగలవు

ప్రేమను ప్రేమించే ప్రేమ


ఓ అమ్మాయి నీవు అందంగా లేవు అన్నాను
కాని నీ చూపుల్లో చిక్కుకుంటాను అని గమనించలేదు

నీ తీయని పలుకులు విని నవ్వుకున్నాను
కాని నా మౌనంలోకి కూడా నువ్వే చేరతావనుకోలేదు

నీ ఊహల్లో నే వున్నా అనుకున్నా కాని
నా ఊహవి నువ్వే అవుతావు అనుకోలేదు

నీ చిలిపి చేష్టలు చూసి ఆనందించాను కాని
అవే నా జ్ఞాపకాలై కలచివేస్తాయని తెలుసుకోలేదు

నేనంటే నీకిష్టం అని ఊహించాను కాని
నాకు నువ్వంటే ఇష్టం అనిపిస్తున్నా చెప్పలేకపోతున్నాను

ఇదంతా ప్రేమో ఆకర్షనో తెలియదు
కాని నీ ద్యానవేదనతో నేను సతమతమౌతున్నాను

Tuesday, September 22, 2009

జోలా పాడాల్సిన నీవే జ్వాలలో తోశావు


పౌర్ణమి నాటి చంద్రునిలా ఉన్నా నిన్ను చూసి
నా మది నీ బానిస అవుతుందని దూరంగా పోసాగాను

నాతొ నడిచి వచ్చే నీ వెన్నెల వెలుగులను చూసి
వాడిపోతాయని మనస్సు చెప్పగా ఆగిపోయాను

నేను నీకు దగ్గరగా నడిచిన కొలది
నీవు దూరంగా నడిచినప్పుడు కూడా అలుపెరుగక పయనించాను

తప్పు నన్ను వీడిపోతున్న నీది కాదు,
నీకై పరుగుతీసే నా మనస్సుది అని అమావాస్యనాడు గ్రహించాను

బుద్దికి తెలిసిన ఈ నిజాన్ని మనస్సు ఒప్పుకోక
అమావాస్యలోను నీకై వెతికే ప్రేమదాసున్ని అయిపోయాను

Wednesday, September 9, 2009

ప్రేమ పిచ్చిదైతే పువ్వు పరిమళం ఎందుకు ?


జీవితం అంటే రంగుల హరివిల్లు అని నాకు తెలియజేశావు
నీ మాటలతో నాలో ప్రేమ అనే జ్వాలను రగిలించావు
నిన్ను చూడని క్షణం నేను నేనుగా లేకుండా చేశావు
నీవు మాట్లాడకున్న ఏదో తెలియని బాధ నాలో రేపుతున్నావు
నా ప్రేమను నీకు తెలియజేయలేక అనుక్షణం నలిగిపోతున్నాను
చూపులకే బాష వున్నా అవి నిన్ను నా చెంత చేర్చేవి అని ఆరాటపడుతున్నాను
నీకు చెప్పి దూరంగా వుండుట కంటే చెప్పక నీతోనే ఉండొచ్చు అని అనుకుంటూ జీవిస్తున్నాను

Sunday, July 19, 2009

నా పంచ ప్రాణాలు నీవని



గులాబీ లాంటి నిన్ను చేరుకోడానికి అడ్డుగావున్న ముళ్ళ గాయాల్ని లెక్కచేయ్యను
అమ్మ పొత్తిళ్ళలోని హాయినీ నాన్న దగ్గర వున్నా చనువును నీలో కనుగొన్నాను
మంచులోని చల్లదనం వెన్నెల్లో వెలుగులు నీ లోగిళ్ళలో పొందగలను
నువ్వు నా చెంత వుంటే ఈ ప్రపంచాన్నే మరిచిపోయి ఉండగలను

Monday, July 13, 2009

విధినైన ఎదిరిస్తా నీకోసం


ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు అని తెలిసి
నువ్వు నాతో శాశ్వతంగా ఉండాలనుకుంటున్నాను

మన కన్నా ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు అనుకుంటూనే,
నిన్ను నాకన్నా ఎక్కువగా ఆరాదించాను

జాలి లేని విధి ఆడించే విచిత్రమైన ఆటలో గెలువలేనని తెలిసి
నిన్ను విడువలేక దాన్ని ఎదిరించి పోరాడుతున్నాను

నీ జీవిత కాలం క్రొవ్వొత్తిలా క్షణ క్షణం తరిగిపోతుంది అని తెలిసి
నీకు ప్రతి క్షణం ఆనందాన్ని అందించాలి అనుకుంటున్నాను

ఈ నెలవంక వీడిన క్షణం నాకు వెన్నెల వుండదు అని తెలిసి
ఆ చీకటిలో అయిన నీ జ్ఞాపకాలు తోడుగా కావాలనుకుంటున్నాను

Wednesday, July 1, 2009

ఏమైందో ఏమో ఈవేళ


నీతో ఊసులాడువేళ ఈ ప్రపంచాన్ని మరచిపోతున్నా
నీవు పలకరించని నిమిషానా నాలో నేను కుమిలిపోతున్నా
నాకు ఏమైందో అన్నది తెలియక ప్రతి క్షణము సతమతమౌతున్నా
నాలోని ప్రేమను నీకు ఎలా తెలుపాలో తెలియక మౌనంగా రోదిస్తున్నా
నా మనస్సు పడే తపన నీవు తెలుసుకోవాలని క్షణ క్షణం తపిస్తున్నా
ఈ మధురయాతన తెలుసుకొని వస్తావని అనుక్షణం నీకై వేచిచూస్తున్నా

Monday, June 29, 2009

నా కంటి పాపా



నా కన్నీరే కరగకుండా దాగివుంది
నా కంటి పాపలో అయిన వున్నా నిన్ను విడవలేక
నా మాట ఎచ్చట దాగుందో తెలియకుంది
నీ చుట్టూ పాటల్లె తిరుగుతుందేమో మౌనంగా
నా ప్రేమ నీకు తెలుపలేని మది మౌనంగా వేచియుంది
కలనైన నిను విడిచే ఊహే నా మనస్సు తలవలేకా
కరుణ చూపి కదలి వస్తావో, హృదయంలో గాయంగా మారి కలచి వేస్తావో ఎదుటపడని నా దేవత ?

నీలోనే నే దాగివున్నా



ఆ బ్రమ్మ నిను నాకై పంపాడో లేదో తెలియదమ్మా
తీయ్యని మాటలతో నా మదిలో కొలువున్న ఓ అందాల బొమ్మ
నీవు నన్ను కాదన్నా, నీ ఊహ వీడలేనే కోయిలమ్మ
నీ నీడ నిను వీడే క్షణమున్నా, నేను నిన్ను వీడే క్షణం ఉండదమ్మ

Monday, June 22, 2009

నీకోసం నేను అని ఎలా తెలుపాలి ?


ఆకాశాన్ని సాగరం చేసి, నెలవంకను సబ్బుగా మార్చి
మేఘాలను నురుగుగా చేసి, చుక్కలను గులాబీ రేకులగా మర్చి
నీకు ఇస్తాను నీవు కోరిన వేళ
నా ఆశలను చిగురింప చేసి నీ ప్రేమ వెలుగులను దీపంగా మర్చి
మంచుల కరిగి చిరునవ్వుల మల్లెల మారి నా లయను నీ పానుపు చేసి
నిదురించవా ఓ నేస్తం

Saturday, June 20, 2009

నీకు ఎలా తెలపాలి నా ప్రేమ ?

నా మనసు నను వీడి నీ చెంత చేరిందే ఒక క్షణము
అది నువ్వు రుజువు చేయమన్న చాలేనా ఈ యుగము
నీ నీడల్లే విహరిస్తు నా వైపే రాను అంది ఏ క్షణము
నీ జ్ఞాపకాలే శ్వాసగా నీ పిలుపుకై వేచివుంది నా మౌనము

Friday, June 19, 2009

ప్రియుని మౌనరాగం

కావు నా ఊహ సుందరివి కాని మాయ చేసి దోచేశావు నా మదిని
రావు నా ముందుకు ఈనాటికి కాని అలజడులతో నిమ్పెస్తాను నా లయని
వీడవు ఎప్పుడు నా అడుగును కాని నీడల వెంటపడి దూరం చేస్తావు నాకు నిదురని
కలవు కావు నువ్వు ఏనాటికీ, విడిచి నేను బ్రతకటానికి నీ జ్ఞాపకాలని

Monday, April 13, 2009

నీవు లేని నేను లేను

క్షణమొక యుగంలా నే గడిపేస్తున్న

నీవు నా చెంతలేని ఈ క్షణాలన్ని !

ఎడారిలో ఎండమావిలా నే పయనిస్తున్నా

మదిలో దాచి నీపై ప్రేమ దాహాన్ని !

నిను మరువలేక మౌనంగా నే రోదిస్తున్నా

తలుచుకుంటూ విడలేని నీ జ్ఞాపకాలన్ని!

నీ పిలుపు కోసం కునుకన్నది లేక వేచిచూస్తున్నా

కరుణించి గెలిపించగా వస్తావని మన ప్రేమ పయనాన్ని ?

నీకై నేను


సాగర తీరాన నీకై ఎగసిన ఆశల వెల్లువ నేను
ఊహలో జగితిలో నీకై పరిభ్రమించే పాటల పల్లవి నేను
మరువలేని ఈ మనోరమకై విరిసిన వెన్నెల వెలుగును నేను
యద కోవెల్లో కొలువుండు నీకై హరతిల కరిగే కర్పూరం నేను
గులాబీ లాంటి నిన్ను కాపాడగా అవతరించిన ముల్లును నేను
నీ లేత అదరాలను ముద్దడగా వచ్చే చిరుగాలిని నేను
నీకై పరుగులు తీసే నా మదిని ఇక ఎలా ఆపగలను నేను

వస్తావా నాకోసం ?


అందుకోలేని నీలి గగనం లాంటి నా నిర్చెలిని చేరుకోలేని అలల అంతరంగం నేను
పారదర్శకమైన నా మదిలో వెల్లి విరిసేను అలజడిలా ఆమె ఎర్రని ప్రేమ కిరణాలు
ఆమెను చేరలేని నా ప్రేమ నేటికి అస్తమించినా అలుపెరుగక రేపు ఉదయించెను
ఈ ప్రేమ జ్వాలతో నేను ఈ మట్టిలో ఇంకిపోకముందే ఆమె మేఘరాగం నన్ను చేరుకోనునా ?

Friday, April 3, 2009

ప్రేమ వేదన

అరుణం నుండి ఉదయించిన ఉషాకిరణంలా
నా ఊహల జగతిలో విరిసిన ఆశల సౌదానివి నువ్వు
కలువ రేకుల్లాంటి కంటి చూపులతో
మాటరాని నా మదిలో సృష్టించావు అలజడుల హరివిల్లును నువ్వు
కోయిల గానం లాంటి నీ మాటలతో
నా మదిలో చేరి నన్ను నీ ప్రేమలో తడిపేసిన చిరుజల్లువు నువ్వు
మదిలో మాటల్ని తెలుపలేక మూగవోయిన నాలో వున్నది
నీ రూపు మాత్రమే అని తెలుసుకోలేవా నువ్వు ?

సాగిపో నీ దారిలో

జీవితమనే బందాల భవసాగరంలో ఆటు పొట్ల వంటివి కష్ట సుఖాలు
కష్టాలు అలల ఎగిసినప్పుడు తలవంచక గమ్యం దిశగా పయనించు
సుఖాల సుడిగుండంలో చిక్కిన మనిషికి నడిచే దారి వుండదు
పదుగురు నీ వెంట వున్నా లేకున్నా ప్రపంచానికి నూతన మార్గం చూపించు
ప్రేమ, సహనం, కరుణ కలిగిన సమ నమజం నిర్మించు ...

మూగవోయిన వాల్మికీ

కమ్మని కవిత చెప్పమంది ఈ బోయవాడిని నా నేస్తం
మూగవోయిన వాల్మీకిని నేను, చెప్పలేని నాపై ఎందుకమ్మా ఈ కోపం
ఈ వెండి వెన్నెల్ని సైతం కరిగించెను నీ తాపం
నా హృదయంలో ఆశల సౌధానికి నీవేనమ్మ జీవన దీపం
కోపంతో ఈ గుండె కోసేస్తావో కరుణతో నా ఊపిరివై బ్రతికిస్తావో నీ ఇష్టం ?

Wednesday, March 4, 2009

తొలిప్రేమ

ఓటమి ఒడిలో ఎండమావిలా పయనించు నాకు
కనిపించవు చల్లని ఉషోదయంలా
గతి తెలియని రాగంలా నీ అందియల సవ్వడితో
పలికించావు నా యదలో సరిగమలు
తొలకరిని పులకింప చేయు చిరుజల్లులా
నా మూగ మదికి నేర్పించావు ప్రేమ రాగాలూ
నా ఉచ్వాసం నీవై, నిచ్వాసం నీ ప్రేమ గీతమై
నా జీవన గమనాన్ని మార్చేశావు
జనులెందరి మద్యలో నే వున్నా
నాకు ఈ లోకం లో కనిపిస్తుంది నువ్వు మాత్రమే!

Wednesday, February 25, 2009

కడదాకా సాగేనా ఈ ప్రేమ పయనం ?

రెండు హృదయాల ఆకర్షణతో తొలకరి జల్లులా మొగ్గతోడిగెను ఈ ప్రేమ
తలపులకు అతి మధురంగా వుండే ఈ ప్రేమ సాదించుటకు అన్ని అగచట్లే !
ఏముందో ఏమో తెలియదు కాని మాన్పలేని తీయ్యని గాయం లాంటిది ప్రేమ
విహరించే ప్రేమ పక్షులకు నిదురలేని రాత్రులెన్నో , నిలబడనియ్యని పయనలింకెన్నో!
కడదాకా సాగేనా లేక కనుమరుగై పోయేనా ఈ అలుపెరుగక ఎగసిపడే ప్రేమ కెరటాలు?

Friday, February 20, 2009

వేచానే నీకోసం

నా మదిలో మెదిలిన ఆమనీ గీతం అది నీ తీయ్యని పలుకై వచ్చిన వైనం
చూపులతో వేసావే పువ్వుల బాణం వేణుగానమై వెల్లువలా వచ్చానే నీ కోసం
హృదయం లో కట్టానే కోవెల నీకోసం ఇక నాట్య మయురమై నువ్వు రావలసిన తరుణం

నేను ఒడానా గెలిచనా?

ఇదో రంగురంగుల సువిశాల ప్రపంచం దానిపై నటించలేని ఓ ఒంటరి నేను
నిన్న నాది అనుకున్నది నేడు లేదు, రేపు ఏమవుతాను అన్న బెంగ నాకు లేదు
అందమైన అబద్దం అంతులేని హాయినీ ఇస్తే నివురుగప్పిన నిజం నిట్టుర్పే మిగిలిస్తుంది
ఆకాశంలో కట్టాను అందమైన హరివిల్లు వెన్నెల్లా విరబూసేన ఆ పూల పొదరిల్లు
నాణెం లో రెండు బాగాలైన గెలుపోటముల్లో తేడ చూసే ఈ లోకంలో నేను ఒడానా గెలిచనా ?

ఆడకు అట అమ్మాయితో

ఘోరకలి ఈ ఆకలి మన జన్మ కారకుల పైన రాచ లీల కేళి
స్త్రీ ఆది పరశక్తై ప్రజ్వలిల్లాలి దుర్మదాందుల మదిలో భీతి కలిగించాలి
పురుషజాతి అహంకారాన్ని విడనాడాలి ఆదరించి వారిని ఆప్యాయంగా ఆదరిచాలి
ప్రేమిస్తే ఆడది అయ్యెను నీ బలిమి ద్వేషిస్తే అయ్యెను నీ పాలిట భద్రకాళి

Tuesday, February 17, 2009

ఎవరికీ ఎవరు ?

ఎవ్వరు నువ్వు , ఈ ప్రపంచం లో దేనికొరకు నీ వెతుకులాట
గమ్యం అంటూ తెలియని ఈ పయనం లో ఎవరికీ ఎవరు తోడూ రారంట
మంచి అన్నది వంచేనే అనే సమాజానికి స్మశానానికి తేడ లేదంట
అందరికోసం నేనున్నా అనుకుంటావు కాని చివరకు ఒంటరివి నువ్వంట

Monday, February 16, 2009

చెలికై తపించే హృదయం

విరహ వేదనతో , భారమైన హృదయముతో నా ఊహలు సప్త సముద్రాలూ ఈది
నా ప్రియురాలి మనసుని చేరి ఆమె మృదుమధురమైన స్పర్శతో పులకించి పోవాలని
ఆమె వెన్నెల వెలుగులతో ఈ చీకటిని వీడి చిరునవ్వుల తీరం చేరాలని తపించే
ఈ బాటసారిని కరుణించి ఆమె, చిరునవ్వుల జల్లై నన్ను తడిపెయ్యగా వచ్చేనా ?

కఠిన హృదయం

రాయి లాంటి మనసు కల నేను రమణి పైన గీతం రాయగలనా
మూగవోయిన నా గాత్రం ఆమె కొరకు పాడగలదా
కవ్వించే మనసు వున్నా ఆమె కఠిన శిలలాంటి నన్ను కరిగించగలదా

Thursday, February 5, 2009

నచ్చావులే

మనసులోని మనోవేదన, నీకు తెలుపలేని నా మౌనరోదన

నట్టనడిమిన నా నావ పయనం మాటలే రాని నే నిన్ను చేరుకోగలనా

భాషలు అనేవి ఎన్ని వున్నా మౌనం నా వాణి అయిన నేను నీ దరి చేరగలనా

అర్ధం కాని హంపి శిల్పమా నీ అంతరంగాన్ని నే గ్రహించగాలనా

కాదు అన్నదీ భరించలేనప్పుడు మదిలో భావం వుంచి ఊహలలో విహరిచుట మేలు అంటావా ?